- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్..!
సీఎం చంద్రబాబు నాయుడు ( Cm chandrababu) కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ కు ( Nara lokesh ) బంపర్ ఆఫర్ తగిలేలా

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు ( Cm chandrababu) కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ కు ( Nara lokesh ) బంపర్ ఆఫర్ తగిలేలా కనిపిస్తోంది. ఆయనకు ప్రమోషన్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి పార్టీలో నారా లోకేష్ మార్కు ఉండేలా... సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే.. టిడిపి పార్టీలో ఓ నిర్ణయాత్మక పదవి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ నెల మహానాడు లోనే ఈ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. ప్రస్తుతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉంటున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పదవి క్రియేట్ చేసి.. నారా లోకేష్ కు బాధ్యతలు ఇవ్వబోతున్నారని సమాచారం అందుతుంది. ఈ మేరకు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ మహానాడు మూడు రోజుల పాటు జరగాలని ఉంది. మే 27, 28, 29 తేదీలలో కడప జిల్లాలో మినీ మహానాడు నిర్వహించబోతున్నారు.






