- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో రేపటి నుంచి జనగణన ప్రారంభం.. ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలే..!
by Vemula.Srinu Prasad |
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి 'జనగణన-2006' ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రాజెక్టు డైరెక్టర్ నివాస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో గృహాల లెక్కింపు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుండి 'జనగణన-2006'(Census-2006)ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రాజెక్టు డైరెక్టర్ నివాస్(Director Niwas) వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో గృహాల(Houses) లెక్కింపు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గణాంకాల సేకరణకు వచ్చే అధికారులకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించి, ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆటంకం కలిగిస్తే..
ఈ ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగించినా లేదా అధికారుల విధులకు అడ్డుతగిలినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ నివాస్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనగణన అనేది అత్యంత కీలకమైన బాధ్యత అని, దీనిని విజయవంతం చేసేందుకు పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నివాస్ కోరారు.
Next Story






