- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఏపీ బ్యూరో : నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) పేరును మార్పు చేస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ పథకాన్ని ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్–గ్రామీణ్ (వీబీ–జీ రామ్ జీ) పేరుతో అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. నూతన పథకంలో మార్పులపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద నేటి నుంచి గ్రామసభలు నిర్వహించనుంది. ఈ గ్రామ సభల్లో ప్రజలు, వేతనదారులకు అవగాహన కల్పించనున్నారు. ఏటా గ్రామీణ కూలీలకు 125 పని దినాలకు హామీ లభిస్తుంది. గతంలో ఈ పని దినాలు 100 రోజులగా ఉండేవి. ఇక వ్యవసాయ పనులకు కూలీల కొరత రాకుండా విత్తనాలు, నూర్పిళ్లు ఎక్కువగా ఉండే ఖరీఫ్ సీజన్‌లో 60 రోజులపాటు ఈ పథకాన్ని నిలిపేస్తారు. దీని కింద చేపట్టే పనుల ప్రణాళిక, పర్యవేక్షణ అంతా గ్రామ పంచాయతీల ద్వారానే జరుగుతుంది.
ప్రజలకు అవగాహన..
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో సోమవారం గ్రామసభలు నిర్వహించనున్నారు. ఎంపీడీఓల నేతృత్వంలో కార్యదర్శులంతా వీటిని నిర్వహించబోతున్నారు. ఈ గ్రామసభల్లో ప్రజాప్రతినిధులతోపాటు ఉపాధి కూలీలను ఆహ్వానించి ప్రధాన అంశాలను వివరిస్తారు. దాదాపు 17 ఏళ్లపాటు అమల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో అనేక మార్పులు చేసిన కేంద్రం.. ఈ పథకంలో మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి ఏయే కార్యక్రమాలు ఇందులో చేపట్టనున్నారో వివరించనున్నారు.
పథకంలో మార్పులు ఇవీ..
- వీబీ–జీ రామ్ జీ పథకంలో నాలుగు అంశాలకు సంబంధించిన పనులకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. జల సంరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి వసతులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు మాత్రమే చేపట్టనున్నారు.
- ప్రతి జాబ్‌కార్డు కలిగిన లబ్ధిదారుడికి ఏడాదికి గరిష్టంగా 125 రోజులు కల్పిస్తారు.
- 14 రోజుల్లో పని కల్పించక పోతే, నేరుగా నిరుద్యోగ భృతి(వేతనంలో సగం) కూలీల ఖాతాకు జమ అవుతుంది.
- పనిచేసిన రోజులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి. ఆలస్యమైతే పరిహారంతో కూడిన వేతనం అందిస్తారు.
- నిర్వహణ వ్యయం 6 శాతం నుంచి 9 శాతానికి పెంచనున్నారు. ఇందులో గతంలో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు భరిస్తుండగా.. ఇకపై 60:40 నిష్ఫత్తిలో భతరించాల్సి ఉంటుంది.
- ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు కూలీల కొరత లేకుండా పూర్తిగా 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఉంటుంది.






