- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ డీజీపీని కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు.. మరోసారి కీలక వ్యాఖ్యలు
రాజకీయవిశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఆన్ లైన్ వేదికగా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: రాజకీయవిశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఆన్ లైన్ వేదికగా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా తనను బెదిరిస్తున్నారని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. తాను చేసిన కామెంట్లను ఇప్పటికే విత్ డ్రా చేసుకున్నానని, జనసేన పార్టీ కూడా దానిని ఆహ్వానించిందన్నారు. ఆ పార్టీ క్యాడర్ కు కూడా ఇది ముగిసిన అధ్యాయం అని విజ్ఞప్తి చేసిందన్నారు.
తనకు ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, తమ ఇంటికి కూడా ఎవరూ రాలేదని చెప్పారు. తాను ఉపసంహరించుకున్న వ్యాఖ్యల గురించి ఇకపై మాట్లాడబోనని అన్నారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇటీవల పవన్ అమిత్ షా భేటీపై కీలక వ్యాఖ్యలు చేయగా వివాదాస్పదంగా మారాయి. భేటీలో జగన్ ను అరెస్ట్ చేయాలని పవన్ అమిత్ షాను కోరినట్టు చెప్పారు. దీంతో అమిత్ షా టీడీపీ తమకు షార్ట్ టర్మ్ మిత్రుడు అని, జగన్ లాంగ్ టర్మ్ మిత్రుడు అని చెప్పినట్టు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపడంతో పాటు పలు చోట్ల నాగేశ్వర్ రావుపై కేసులు నమోదు చేశారు. ఆ తరవాత నాగేశ్వర్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.






