AP Government:సచివాలయ ఉద్యోగుల బదిలీలకు విధివిధానాలివే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-16 13:04:01  IST  )

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

AP Government:సచివాలయ ఉద్యోగుల బదిలీలకు విధివిధానాలివే!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రాష్ట్రం(Andhra Pradesh)లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై తాజాగా విధివిధానాలు జారీ చేసింది.

ఆయా సచివాలయాల్లో ఎంత మంది సిబ్బంది ఉండాలి. బదిలీలపై సర్క్యులర్ జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు వారి బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం(AP Government) సర్క్యూలర్‌లో వెల్లడించింది. ఉమ్మడి జిల్లానే ప్రాతిపదికగా బదిలీలు ఉంటాయని తెలిపింది.

విధివిధానాలివే..

*మే 31/2025 నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్దేశించింది. 5 ఏళ్ల కాలం పూర్తి కాని వారు వ్యక్తిగత అభ్యర్ధన మేరకు మాత్రమే బదిలీలకు అర్హులని స్పష్టం చేసింది.

*ఉద్యోగికి తన స్వగ్రామం, మండలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టింగ్ ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

*భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.

*కంటి చూపు సరిగా లేనివారు, మానసిక రుగ్మతలతో బాధపడే పిల్లలు ఉన్న వారిని మెడికల్ ఫెసిలిటీ ఉన్న చోటికి బదిలీ చేయాలని సూచించింది.

ఈ మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల(జూన్) 30 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం(Government) ఆదేశించింది.

Next Story