- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాతికి దోపిడీ..ఒక్కరికి రూ. 2000!
హైదరాబాద్ నుంచి ఎటు వెళ్లాలన్నా రూ.2 వేలకు పైమాటే అంటున్నారు ప్రయాణికులు. దీంతో ట్రావెల్స్ మాఫియా ప్రయాణికులను దోచుకుంటోందని విమర్శలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండగ వస్తోన్న నేపథ్యంలో చాలా మంది హైదరాబాద్ నుంచి తమ ఊళ్లకు వెళుతున్నారు. అయితే, ఈ సంక్రాంతిని అడ్డు పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దోపిడీకి పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆన్ లైన్ లో టికెట్లు లేవంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయట ప్రైవేట్ ట్రావెల్స్. ఆఫీసుల్లో రెట్టింపు ధరలకు విక్రయాలు జరుపుతున్నాయని సమాచారం అందుతోంది.
హైదరాబాద్ నుంచి ఎటు వెళ్లాలన్నా రూ.2 వేలకు పైమాటే అంటున్నారు ప్రయాణికులు. దీంతో ట్రావెల్స్ మాఫియా ప్రయాణికులను దోచుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ రేట్లు పెంచింది, మేం పెంచితే తప్పేంటి అని ఎదురు దాడి చేస్తోన్నారట. డిమాండ్ ను బట్టి రేట్లు పెంచుతాం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారట. ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు.. భారీగా ధరలు వసూలు చేస్తున్నారట.






