- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడిగేవారు లేక..యధేచ్ఛగా మట్టి దందా
కొణిజర్ల మండలంలోని తనికెళ్ల, చిన్న మునగాల, పెద్దగోపతి గ్రామాల్లో నిరంతరాయంగా మట్టి తవ్వకాలు, రవాణా సాగుతోంది.

కొణిజర్ల మండలంలోని తనికెళ్ల, చిన్న మునగాల, పెద్దగోపతి గ్రామాల్లో నిరంతరాయంగా మట్టి తవ్వకాలు, రవాణా సాగుతోంది. ఆయా గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు అక్రమ మట్టి వ్యాపారం చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. మట్టి రవాణాకు మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఖాతరు చేయకుండా ఎవరిష్టం వచ్చినట్టు వారు ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. మట్టి తోలకాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యాపారుల జేబుల్లోకి వెళుతుంది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. - దిశ, కొణిజర్ల
దిశ, కొణిజర్ల: కొణిజర్ల మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అడిగే వారు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటుంది. మండలంలో తనికెళ్ల, చిన్న మునగాల, పెద్దగోపతి గ్రామాల్లో నిరంతరాయంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు అక్రమ మట్టి వ్యాపారం చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మట్టి తవ్వకాలు చేయాలంటే మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ మట్టి మాఫియాకు ఇవేమి అక్కర్లేదు. పట్టించుకున్న వారు లేకపోవడం చట్టాలతో పనే లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వారు ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు.
ప్రభుత్వ భూములు, కాల్వ కట్టలే లక్ష్యంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. మండల పరిధిలోని పెద్దగోపతి గ్రామ రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 541లో ఉన్న బంజరాయి భూమిలో గత కొన్ని నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. గ్రామానికి చెందిన కొంతమంది సొంత జేసీబీలతో మట్టిని తవ్వి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకుంటున్నారు. మైనింగ్ శాఖ నుంచి మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకున్న పరిమితికి లోబడి మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. పెద్దగోపతి గ్రామ సమీపంలో బంచరాయి భూమిలో 15నుంచి 20అడుగుల లోతు తవ్వుతూ నామరూపాలు లేకుండా చేస్తున్నారు. అక్రమ మట్టి తోలకాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యాపారుల జేబుల్లోకి వెళుతుంది. ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో ఎక్కడైనా మట్టి తవ్వకాలు జరపాలంటే మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతున్న పట్టించుకునే వారు లేకపోవడంతో చట్టాలు చట్టబండలుగా మారుతున్నాయి. ఫిర్యాదు చేసిన కనీసం పట్టించుకునే స్థితిలో అధికారులు లేకపోవడం విశేషం. అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు స్పందించి అక్రమ మట్టి తోలకాల నిరోధించాలని ప్రజల కోరుతున్నారు.
అనుమతి లేకుంటే చర్యలు తీసుకుంటాం
తహసీల్దార్ అరుణ
మట్టి తవ్వకాలు జరపాలంటే మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా తవ్వితే చర్యలు తీసుకుంటాం.






