- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ.. వేదిక ఖరారు
'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై 5న తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాను జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన తేదీ, వేదికను ప్రకటిస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని జూలై 5న తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అయితే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారనే విషయాన్ని చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు. దీంతో ఈ వేడుకకు ప్రత్యేక అతిథి వస్తారా? లేక చిత్ర యూనిట్ సభ్యులే పాల్గొంటారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.






