వివాదాస్పద వ్యాఖ్యలు.. మరో కేసులో యూట్యూబర్ రావణ్ అరెస్ట్

by Malleboina Mahesh |

యూట్యూబర్ రావణ్‌ను మరో కేసులో అరెస్ట్ చేసిన మచిలీపట్నం పోలీసులు.. రెండు కేసుల్లో బెయిల్ వచ్చిన కొద్దిసేపటికే కాకినాడలో మళ్లీ అదుపులోకి!

వివాదాస్పద వ్యాఖ్యలు.. మరో కేసులో యూట్యూబర్ రావణ్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం రేపుతున్న వివాదాస్పద యూట్యూబర్ 'రావణ్' (YouTuber Ravan) చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇప్పటికే నమోదైన రెండు కేసులలో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే.. పోలీసులు ఆయనకు మరో షాక్ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసులో రావణ్‌ను మచిలీపట్నం పోలీసులు కాకినాడలో మళ్లీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

యూట్యూబ్, సామాజిక మాధ్యమాల వేదికగా అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై రావణ్‌పై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి న్యాయస్థానం ఆయనకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ ఇచ్చింది. అయితే, రావణ్ జైలు నుంచి విడుదలయ్యే లోపే మచిలీపట్నంలో నమోదైన కేసును రంగంలోకి తెచ్చిన పోలీసులు, పక్కా ప్లాన్‌తో ఆయన్ను మళ్లీ అరెస్ట్ చేసి తరలించారు. ఈ వరుస అరెస్టుల పరిణామం సోషల్ మీడియా సర్కిల్స్, ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story