ఇద్దరు స్టార్స్ మధ్య ఇరుక్కుపోయిన ధనుష్.. కొత్త విడుదల తేదీ వెతుక్కోవాల్సిందేనా?

by Pulgam srinivas |

'జైలర్ 2' , 'విశ్వంభర' రిలీజ్‌లతో ధనుష్ 'ఓం' సినిమాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇద్దరు స్టార్స్ మధ్య ఇరుక్కుపోయిన ధనుష్.. కొత్త విడుదల తేదీ వెతుక్కోవాల్సిందేనా?
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ముందుగా విడుదల తేదీ ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలు అదే తేదీకి లేదా ఒకటి, రెండు రోజుల తేడాతో విడుదలకు వస్తే కొన్ని చిత్రాలు తమ రిలీజ్‌ను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం హీరో ధనుష్ నటిస్తున్న 'ఓం' సినిమా పరిస్థితి కూడా అలానే మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓం' చిత్రంలో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'జైలర్ 2' చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' కూడా అక్టోబర్ 15న విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే తమిళ్, తెలుగు రెండు ఇండస్ట్రీల్లోనూ ధనుష్ సినిమాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో 'ఓం' విడుదల తేదీని మార్చే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి మేకర్స్ రిలీజ్ డేట్‌ను మార్చుతారా? లేక ముందుగా ప్రకటించిన తేదీకే రిస్క్ చేసి సినిమాను విడుదల చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story