- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారుల కోసం టీటీడీ 'అక్షర గోవిందం'
చిన్నారుల కోసం టీటీడీ 'అక్షర గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. తిరుమలలో చిన్నారుల కోసం 'అక్షర గోవిందం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. టీటీడీ పాలక మండలి. ఈ రోజు చిన్నారుల కోసం అక్షర గోవిందం - అన్నప్రాసన కార్యక్రమాలను ప్రారంభించనుంది. తిరుపతిలోని వకుళమాత ఆలయంలో ఇకపై మంగళవారం మినహా రెండు బ్యాచ్ లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్ కు 25 మంది చొప్పున అక్షరభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైంది టీటీడీ. వీరికి ఉచితంగా 'అక్షర గోవిందం' కిట్ ఇస్తామని కూడా వెల్లడించింది. దీని కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది. పూర్తి వివరాలు కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచనలు చేసింది.
Next Story






