- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నిర్వాకం.. నడిరోడ్డుపై ప్రయాణికులను వదిలేసి పరారీ!
by Ramesh Naini |
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిబ్బంది నిర్వాకంతో ప్రయాణికులు నడిరోడ్డుపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిబ్బంది నిర్వాకంతో ప్రయాణికులు నడిరోడ్డుపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నుంచి పాలకొల్లు బయలుదేరిన ‘వర్మ ప్రైవేటు ట్రావెల్స్’ బస్సు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం చేరుకోగానే.. బస్సులో డీజిల్ అయిపోయిందని డ్రైవర్ ప్రయాణికులకు తెలిపాడు. అనంతరం వారిని రోడ్డుపైనే వదిలేసి అక్కడి నుంచి ఉడాయించాడని, ఆ వెంటనే తన మొబైల్ స్విచ్చాఫ్ చేసుకున్నాడని ప్రయాణికులు ఆరోపించారు.
నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రయాణికులు.. ప్రత్యామ్నాయం కోసం ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేసినా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.
Next Story






