ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా.. విశాఖలో ఆర్టీఏ తనిఖీలు

by Vemula.Srinu Prasad |

పండగ పేరుతో ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్ దోచుకుంటున్నాయి....

ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా.. విశాఖలో ఆర్టీఏ తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్: పండగ పేరుతో ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్(Private Travels) దోచుకుంటున్నాయి. నిబంధనలకు మించి టికెట్ రేట్లు(Ticket Rates) వసూలు చేస్తున్నారు. సంక్రాంతి ముగియడంతో విశాఖ(Visakha), విజయవాడ(Vijayawada), హైదరాబాద్(Hyderabad), చెన్నై(Chennai), బెంగళూరు(Bengalur) వంటి ప్రాంతాలకు భారీగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ చార్జిల మోత మోగిస్తున్నాయి. విశాఖ నుంచి బెంగళూరుకు టికెట్ రేటు రూ. 6 వేలు వసూలు చేస్తున్నారు. విషయం ఆర్టీఏ అధికారులు తెలియడంతో తనిఖీలు నిర్వహించారు. విశాఖ సత్యం జంక్షన్‌లో రామ్ దలాల్ ట్రావెల్స్ బస్సులో సోదాలు చేశారు. విశాఖ టు బెంగళూరుకు రూ. 6 వేలు వసూలు చేసినట్లు నిర్దారణ అయింది. దీంతో బస్సును బస్సును రెండు గంటలుగా అధికారులు నిలిపివేశారు. ప్రయాణికులను బెంగళూరు తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story