రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత.. ప్రైవేట్ డాక్టర్స్ కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

శుక్రవారం నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ డాక్టర్స్ తెలిపారు..

రేపటి  నుంచి  NTR హెల్త్ సేవలు నిలిపివేత.. ప్రైవేట్ డాక్టర్స్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో శుక్రవారం నుంచి NTR హెల్త్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ హాస్పటల్‌కి ప్రభుత్వం దాదాపు రూ.2700 కోట్ల బకాయిలు ఉంది. దీంతో ఈ బకాయిలు విడుదల చేయాలని కొంత కాలంగా ప్రైవేట్ హాస్పటల్‌ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సమయం కోరుతూ ప్రభుత్వం ఇంతవరకు వచ్చింది. కానీ రెండు రోజులుగా ప్రైవేట్ డాక్టర్స్ ఆందోళనను ఉధృతం చేశారు. ప్రజాప్రతినిధులను సైతం కలిశారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిపివేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం నిర్ణయించారు. ఈ మేరకు ప్రైవేట్ డాక్టర్స్ క్లారిటీ ఇచ్చింది.

‘‘15 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలపై ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా సమస్యలను సీఈవో, హెల్త్ సెక్రటరీకి తెలియజేశాం. ఇంకా కొంత సమయం అడిగారు. అయితే బుధవారం ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరిగింది. సభ్యులందరూ సమయం ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పారు. దీంతో మా నిస్సహాయతను ప్రభుత్వానికి తెలియజేశాం. ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించలేకపోతున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.’’ అని ప్రైవేటు డాక్టర్స్ పేర్కొన్నారు.

Next Story