HPCL విశాఖ రిఫైనరీపై ప్రధాని ప్రశంసల వర్షం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-06 04:54:29  IST  )

రిఫైనరీ రంగంలో సరికొత్త మైలురాయి దాటిన ఆంధ్రప్రదేశ్.

HPCL విశాఖ రిఫైనరీపై ప్రధాని ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : HPCL విశాఖ రిఫైనరీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత ఇంధన భద్రతకు ఈ రిఫైనరీ మరింత వేగాన్ని ఇస్తుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేసే దిశగా దోహదపడుతుందని పేర్కొన్నారు. తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. తన పోస్టులో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ ట్వీట్ ను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి విశాఖ రిఫైనరీ విషయమై కీలక వ్యాఖ్యలను తన ఎక్స్ ఖాతా వేదికగా చేసిన విషయం విదితమే.

విశాఖపట్నం కేంద్రంగా భారతదేశ ఇంధన రంగంలో సరికొత్త చరిత్ర లిఖించబడిందని.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తన విశాఖ రిఫైనరీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ' (RUF)ని విజయవంతంగా ప్రారంభించిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందన్నారు. ఇంధన భద్రతను పెంపొందించడం ద్వారా 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది ఒక కీలక ముందడుగుగా కొనియాడారు. ఈ అత్యాధునిక సదుపాయం భారత ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో సుమారు 2,200 మెట్రిక్ టన్నుల బరువున్న మూడు భారీ 'LC-Max' రియాక్టర్లను అమర్చారన్నారు.ఇది కేవలం ఒక రిఫైనరీ విభాగం మాత్రమే కాదని, భారత్ సాధించిన సాంకేతిక విజయానికి ప్రతీకని కొనియాడారు.

అధునాతన 'రెసిడ్యూ హైడ్రోక్రాకింగ్' టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా గతంలో వృథాగా పోయే ముడి చమురు అవశేషాల (Bottom of the barrel oils) నుండి ఏకంగా 93 శాతం వరకు అధిక విలువైన ఇంధన ఉత్పత్తులను సేకరించవచ్చని వివరించారు. దీనివల్ల ప్రతి ముడి చమురు చుక్కను గరిష్టంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఈ సాంకేతికత ద్వారా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల లభ్యత పెరగడమే కాకుండా.. విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టు తూర్పు తీర ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, దేశ ఇంధన స్వయం సమృద్ధికి వెన్నెముకగా నిలవనుందని వెల్లడించారు.

Read More..

‘ఫాల్కన్’ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ముంబైలో ఎండీ అమర్‌దీప్ అరెస్ట్

Next Story