ప్రధాని మోదీతో లోకేష్ భేటీ.. యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ

by Naga Rani Yarlagadda |

ఈ భేటీలో ప్రధానమంత్రి 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ (Yuvagalam Coffee Table Book) ‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. అలాగే ప్రధాని ఆవిష్కరించిన పుస్తకంపై ఆటోగ్రాఫ్ చేసి, లోకేష్ కు జ్ఞాపకంగా ఇచ్చారు.

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ.. యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh).. తన భార్య బ్రాహ్మణి (Brahmani), కుమారుడు దేవాన్ష్ లతో కలిసి శనివారం రాత్రి న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోదీని (PM Modi) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అమరావతి పునర్నిర్మాణ (Amaravati Restart) మహోత్సవానికి వచ్చిన ప్రధాని.. లోకేష్ ను పర్సనల్ గా కలవాలని ఆహ్వానించగా.. ఆయన ఆహ్వానం మేరకు లోకేష్ కుటుంబ సమేతంగా ప్రధానితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానమంత్రి 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ (Yuvagalam Coffee Table Book) ‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. అలాగే ప్రధాని ఆవిష్కరించిన పుస్తకంపై ఆటోగ్రాఫ్ చేసి, లోకేష్ కు జ్ఞాపకంగా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించారు. దేవాన్ష్ ను తన ఒడిలో కూర్చోపెట్టుకుని మరీ ముచ్చటించారు. ప్రధానితో జరిగిన ఈ కుటుంబ సమావేశం.. లోకేష్ కు ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా.. 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ లో.. 2024 ఎన్నికలకు (2024 AP Elections) ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను పొందుపరిచారు. ఆ పాదయాత్రే రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విజయానికి బాటలు వేసిందనడంలో సందేహం లేదనే చెప్పాలి. ప్రధానితో భేటీ సందర్భంగా.. మంత్రి నారా లోకేష్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా, జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందించేందుకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా ప్రధానిని లోకేష్ కోరారు.

Next Story