మంత్రి లోకేష్ చొరవ.. 10 సీసీ రోడ్లు పూర్తి

by Vemula.Srinu Prasad |

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరు మైనారిటీ కాలనీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది...

మంత్రి లోకేష్ చొరవ.. 10 సీసీ రోడ్లు పూర్తి
X

దిశ, మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరు మైనారిటీ కాలనీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి నారా లోకేష్ చొరవతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల కింద రూ.35 లక్షల వ్యయంతో 10 సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన మైనారిటీ కాలనీలో ఇప్పటి వరకు సీసీ రోడ్లు లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. మంత్రి ప్రత్యేక చొరవతో కాలనీలో 10 సీసీ రోడ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తికావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సమస్యకు పరిష్కారం లభించడంతో కాలనీవాసులు, గ్రామస్తులు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు

Next Story