సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని మోడీ

by Ajay Maddhiboyina |

పుట్ట‌ప‌ర్తిలో నేడు జ‌రుగుతున్న స‌త్య‌సాయి శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌కు ప్ర‌ధానీ మోడీ విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా మోడీ ప్ర‌శాంతి నిల‌యానికి చేరుకుని సాయి క‌ల్వంత్ హాల్ లో స‌త్య‌సాయి స‌మాధిని ద‌ర్శించుకున్నారు. ప్ర‌ధానికి పండితులు వేద ఆశీర్వ‌చ‌నం చేశారు.

సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని మోడీ
X

దిశ‌, వెబ్ డెస్క్: పుట్ట‌ప‌ర్తిలో నేడు జ‌రుగుతున్న స‌త్య‌సాయి శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌కు ప్ర‌ధానీ మోడీ విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా మోడీ ప్ర‌శాంతి నిల‌యానికి చేరుకుని సాయి క‌ల్వంత్ హాల్ లో స‌త్య‌సాయి స‌మాధిని ద‌ర్శించుకున్నారు. ప్ర‌ధానికి పండితులు వేద ఆశీర్వ‌చ‌నం చేశారు. మోడీ వెంట సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ సైతం ఉన్నారు. ద‌ర్శ‌నం త‌ర‌వాత మోడీ హిల్ వ్యూ స్టేడియానికి చేరుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌త్య‌సాయి చిత్రంతో కూడిన 100 రూపాయ‌ల నాణెం, స్టాంపును ప్ర‌ధాని ఆవిష్క‌రించనున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, టీమ్ ఇండియా మాజీ క్రికెట్ టీం కెప్టెన్ స‌చిన్, హీరోయిన్ ఐశ్వ‌ర్య రాయ్ స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఇక‌ నేటి నుండి ఈ నెల 23 వ‌ర‌కు స‌త్య‌సాయి శ‌త జ‌యంతి ఉత్స‌వాలు జ‌రగ‌నున్నాయి.

Next Story