- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ ఇంటికి ప్రధాని మోడీ.. పోలీసుల ఆధీనంలో వెళ్లే రహదారులు
ప్రధాని నరేంద్ర మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేస్తుండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఈ ఇద్దరు అగ్రనేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకోవడంతో పవన్ నివాసం వద్ద సందడి నెలకొంది..

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Jana Sena chief Pawan Kalyan) నివాసానికి విచ్చేస్తుండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఈ ఇద్దరు అగ్రనేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకోవడంతో పవన్ నివాసం వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్తగా పవన్ ఇంటికి వెళ్లే రహదారులన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి భారీ భద్రతా వలయాన్ని నిర్మించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
భద్రతా కారణాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఇంటి వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడమే కాకుండా, ఎవరినీ అటువైపు అనుమతించడం లేదు. కేవలం అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతమంతా పోలీస్ పహారాలో ఉండటంతో స్థానికంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ చారిత్రాత్మక భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.






