రాష్ట్రంలో రూ. 13,429 కోట్లతో అభివృద్ధి పనులు.. రెండు ప్రాజెక్టులు జాతికి అంకితం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-16 10:51:35  IST  )

కర్నూలులో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభ వేదిక నుంచి ప్రధాని మోడీ వివిధ ప్రాజెక్టులను వర్చువలుగా ప్రారంభించారు...

రాష్ట్రంలో రూ. 13,429 కోట్లతో అభివృద్ధి పనులు.. రెండు ప్రాజెక్టులు జాతికి అంకితం
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలులో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభ వేదిక నుంచి ప్రధాని మోడీ వివిధ ప్రాజెక్టులను వర్చువలుగా ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

శంకుస్థాపనలు:

విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ - రూ. 2886 కోట్లు

ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ - రూ. 4922 కోట్లు

కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్ – రూ. 493 కోట్లు

పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ - రూ. 184 కోట్లు

సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి - రూ. 964 కోట్లు

ప్రారంభోత్సవాలు:

రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు - రూ. 82 కోట్లు

కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లు - రూ. 286 కోట్లు

కనిగిరి బైపాస్ రోడ్ - రూ. 70 కోట్లు

గుడివాడ-నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి – రూ. 98 కోట్లు

కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు – రూ. 13 కోట్లు

పీలేరు - కలసూర్ నాలుగు లేన్ల రోడ్ - రూ. 593 కోట్లు

నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం - రూ. 362 కోట్లు

చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ – రూ. 200 కోట్లు

జాతికి అంకితం:

కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు– రూ. 546 కోట్లు

శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ - రూ. 1730 కోట్లు.

Read More : ఏపీకి పటిష్టమైన నాయకత్వం ఉంది.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ప్రధాని ప్రశంసలు

Next Story