ఏపీ పర్యటన చాలా ఆనందాన్నిచ్చింది: ఎక్స్‌లో ప్రధాని మోడీ ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-16 13:20:01  IST  )

ఏపీ పర్యటన చాలా ఆనందాన్నిచ్చిందని ఎక్స్‌లో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ...

ఏపీ పర్యటన చాలా ఆనందాన్నిచ్చింది: ఎక్స్‌లో ప్రధాని మోడీ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap) పర్యటన చాలా ఆనందాన్నిచ్చిందని ఎక్స్‌లో ప్రధాని మోడీ(Pm Modi) ట్వీట్ చేశారు. రాష్ట్ర పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ(Delhi)కి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణంమన్నారు. పరిశ్రమలను అభివృద్ధి చేసి ప్రజలను శక్తిమంతులు చేసేలా చాలా ప్రాజెక్టులు మంజూరు చేశామని తెలిపారు. ‘‘శ్రీశైలం క్షేత్రంలో ఉండటం అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ పవిత్ర స్థలంలో అడుగడుగున దైవత్వం నిండి ఉంది. ఇక్కడి ప్రజల సాదర స్వాగతానికి నేను కృతజ్ఞుడిని. శ్రీ భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లు ఎల్లప్పుడూ మన దేశాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.

కాగా ప్రధాని మోడీ ఈ రోజు కర్నూలు జిల్లా(Kurnool District)లో పర్యటించారు. పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. నన్నూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగించారు. అనంతరం తిరిగి ఢిల్లికి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ స్పందించారు.

మోడీ ట్వీట్...

Next Story