Narendra Modi: మే 2న అమరావతికి ప్రధాని మోదీ రాక

by Anil Sikha |
Narendra Modi: మే 2న అమరావతికి ప్రధాని మోదీ రాక
X

వెల్లడించిన సీఎం చంద్రబాబు

అసెంబ్లీ నిర్మాణానికి రూ.615 కోట్లు

హైకోర్టు భవన నిర్మాణానికి రూ.786 కోట్లు

ఈ రెండు భవన నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం

దిశ, డైనమిక్​ బ్యూరో: దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో (Amaravathi) పర్యటించనున్నారు. ఆయన రాక తేదీని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రకటించారు. మే2 న ఆయన అమరావతికి వచ్చి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలని సీఎం తెలిపారు. ఈ మేరకు టెండర్లు పిలిచామన్నారు. ఈ రోజు ఏపీ కేబినెట్​సమావేశం ముగిసన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మోదీ రాకతో అమరావతి రాజధాని పనులు మరింత ఊపందుకోనున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ, హైకోర్టు నూతన భవన నిర్మాణాల ప్రతిపాదనలకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. రూ.627 కోట్లతో అసెంబ్లీ (Assembly) భవన నిర్మాణం, రూ.786 కోట్లతో నూతన హైకోర్టు భావన నిర్మాణం చేపట్టనున్నారు. భవన నిర్మాణాలను ఎల్ 1 బిడ్డర్ కు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణ కు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ పై ఆర్డినెన్స్ జారీకి క్యాబినెట్ (Cabinet)ఆమోదం తెలిపింది. సీఆర్డీయే నిర్ణయాలకు కూడా ఆమోదం తెలియజేసింది. పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశం నిర్ణయాలను కూడా మంత్రివర్గం ఆమోదించింది.



Next Story

Most Viewed