- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కూటమి పాలనపై ప్రధాని మోడీ ప్రశంసలు
ఏపీలో కూటమి పాలనపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు..

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా విమర్శలకు దీటుగా బదులు ఇవ్వాలని ఏపీ(Ap), తెలంగాణ(Telangana) కూటమి ఎంపీలకు ప్రధాని మోడీ(Prime Minister Modi) సూచించారు. రెండు రాష్ట్రాల కూటమి ఎంపీలకు ఢిల్లీలో అల్పాహారం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ కూటమి ఎంపీలను ప్రధాని మోడీ ప్రశంసించారు. ఏపీలో పాలన బాగుందని తెలిపారు. చంద్రబాబు పరిపాలనపై మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని చెప్పారు. ఏపీకి పెట్టుబడుల ప్రవాహం మంచి అభివృద్ధికి సూచన అని ప్రధాని పేర్కొన్నారు. టీడీపీ(Tdp), జనసేన(Janasena) ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ ముందు కెళ్లాలని బీజేపీ(Bjp) ఎంపీలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. కూటమి బలోపేతంపై పని చేయాలని ప్రధాని సూచించారు. కూటమి పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి వస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని కూటమి ఎంపీలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు.






