- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yoga day: యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోడీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్‌లో పెద్ద ఎత్తున యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ రికార్డు బ్రేకింగ్ యోగా డే వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: నేడు ప్రపంచ యోగా దినోత్సవం (World Yoga Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ (Vizag)లో పెద్ద ఎత్తున యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ రికార్డు బ్రేకింగ్ యోగా డే వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) హాజరయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం తెల్లవారుజామున 6. 30 నిమిషాలకు ప్రారంభం అయిన ఈ యోగా వేడుకులకు ప్రధానితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు వేలాది మంది విద్యార్థులు ఈ 11 ప్రపంచ యోగా డే వేడుకల (11 World Yoga Day celebrations)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్మా (Deputy CM Pawan Kalyan) ట్లాడుతూ.. యోగ విద్యను ప్రపంచానికి అందించిన ఆది యోగి పరమ శివునికి, మహా యోగ విద్యను దేశ ప్రజలకు అందించిన పతంజలి మహర్షి యోగ శాసనాల రూపంలో ఆందించారని వారి పాదాలకు నమస్కారాలు చేస్తూ.. పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
యోగా విశిష్టతను రుగ్వేదంలో ఉన్న మహానుబావులు తెలియజేస్తే.. దానిని ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధానమంత్రి మోడీ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.. ప్రధాని మోడీ భారతీయ సనాతన ధర్మ విశిష్ఠతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ప్రధాని మోడీకి సాధ్యం అయిందని అన్నారు. యోగా భారతీయులకు దక్కిన గౌరవం అని, 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగాను ప్రవేశ పెట్టగా.. యోగాకు 177 దేశాల మద్దతు కూడగట్టిన శక్తి మోడీదే అని.. వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలని పవన్ కల్యాణ్ విశాఖ యోగా డే వేదిక సందర్శంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.






