‘యోగా డే’కు ప్రధాని మోడీ.. విశాఖలో Cm చంద్రబాబు ఘన స్వాగతం

by Vemula.Srinu Prasad |

ప్రధాని మోడీ విశాఖకు చేరుకున్నారు.....

‘యోగా డే’కు ప్రధాని మోడీ.. విశాఖలో Cm చంద్రబాబు ఘన స్వాగతం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Pm Modi) విశాఖకు చేరుకున్నారు. ఆర్కే బీచ్‌(Rk Beach)లో శనివారం జరగనున్న ‘యోగా డే’(Yoga Day) కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖ ఎయిర్ పోర్టు(Visakha Airport)కు చేరుకున్న ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తదితర కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి విశాఖలోనే ప్రధానికి బస ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం జరిగే ‘యోగా డే’ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. అనంతరం యోగాను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

కాగా యోగా డే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గిన్నీస్ బుక్ రికార్డ్(Ginnis Book Record) సాధించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మొత్తం 5 లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగే ‘యోగా డే’లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. విశాఖ ఏయూలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

అయితే ఈ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు సైతం విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ పర్యటన ముగిసే వరకూ కేంద్ర ప్రభుత్వ భద్రత సిబ్బందితో పాటు రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ బస ప్రాంతంతో పాటు శనివారం యోగా డేకు వెళ్లే రహదారిలో భారీగా మోహరించారు. మోడీ పర్యటన దృష్ట్యా విశాఖ నగరంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. మోడీ పర్యటనను సక్సెస్ చేసేందుకు కృషి చేస్తున్నారు.

Next Story