వేట్లపాలెం ఘటనపై మోడీ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటన

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా వేట్లపాలెం సూర్య ఫైర్ వర్క్స్‌ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు....

వేట్లపాలెం ఘటనపై మోడీ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) వేట్లపాలెం సూర్య ఫైర్ వర్క్స్‌(Vetlapalem Surya Fire Works) ఘటనపై ప్రధాని మోడీ(Prime Minister Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వేట్లపాలెం పేలుళ్లు చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ కోరుకున్నారు. కాగా వేట్లపాలెం ఘటనలో 21 మంది సజీవదహనం అయ్యారు. 9 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకూ 13 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహె‌కు తరలించారు.

Next Story