- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ ఓదార్పు ఉపశమనం కలిగించింది: మంత్రి నాదెండ్ల
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మరణం పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ నాదెండ్ల మనోహర్‌కు ప్రధాని ప్రత్యేకంగా లేఖ రాశారు. ..

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు(Former CM Nadendla Bhaskara Rao) మరణం పట్ల ప్రధాని మోడీ(Prime Minister Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ నాదెండ్ల మనోహర్‌కు ప్రధాని ప్రత్యేకంగా లేఖ రాశారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండి, రాష్ట్ర అభివృద్ధికి భాస్కరరావు చేసిన సేవలను మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టసమయంలో దేవుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ..
ప్రధాని పంపిన ఈ ఓదార్పు లేఖపై నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) స్పందిస్తూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం ఎదుర్కొంటున్న ఈ తీరని లోటు సమయంలో ప్రధాని మోదీ పంపిన లేఖ మరియు ఆయన పలికిన ఓదార్పు మాటలు తమకు ఎంతో ధైర్యాన్ని, ఉపశమనాన్ని కలిగించాయని మనోహర్ పేర్కొన్నారు. ప్రధాని చూపిన ఈ ఆత్మీయతకు తమ కుటుంబం రుణపడి ఉంటుందని ఆయన భావోద్వేగంగా పోస్ట్ చేశారు.






