PM Nareandra Modi : పవన్ కు ప్రధాని మోడీ ఫోన్... కుమారుడి ఆరోగ్యంపై ఆరా

by Muthe.Rajitha |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడి మార్క్ శంకర్(Mark Shankar) ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఆరా తీశారు.

PM Nareandra Modi : పవన్ కు ప్రధాని మోడీ ఫోన్... కుమారుడి ఆరోగ్యంపై ఆరా
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడి మార్క్ శంకర్(Mark Shankar) ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఆరా తీశారు. పవన్ కు మోడీ ఫోన్ చేసి మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సింగపూర్ లోని ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో మార్క్ గాయపడిన విషయం తెలిసిందే. కాలిన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మన్యం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కు ప్రధాని ఫోన్ చేసి.. ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు స్పందించి, మార్క్ ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో వైజాగ్ నుంచి సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు.

Next Story