- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ.. గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన మంత్రులు
ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె్ల్సీలు, అధికారులు మోడీకి పుష్పగుచ్చాలతో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె్ల్సీలు, అధికారులు మోడీకి పుష్పగుచ్చాలతో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రాజధాని అమరావతి (Amaravati) పనులు పునః ప్రారంభం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బుద్ధుడు, కాలచక్రం, ఎన్టీఆర్, ప్రధాని నరేంద్రమోడీ విగ్రహాలతో పాటు మేక్ ఇన్ ఇండియా లోగో ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు ‘అమరావతి’ అక్షరాలను రూపొందించారు. వీటిని ఐరన్ స్క్రాప్‌తో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు.
Next Story






