నీటి భద్రతను జాతీయ భద్రతగా ప్రధాని పరిగణిస్తున్నారు : కేంద్రమంత్రి

by Thanuru Gopichand |

నీటి భద్రతను జాతీయ భద్రతగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) పరిగణిస్తున్నారని

నీటి భద్రతను జాతీయ భద్రతగా ప్రధాని పరిగణిస్తున్నారు : కేంద్రమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : నీటి భద్రతను జాతీయ భద్రతగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) పరిగణిస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు వెల్కం గ్రాండ్ హోటల్లో సోమవారం ప్రారంభమైన వాటర్ షెడ్ మహోత్సవ్ (Water Shed Mahotsav) కార్యక్రమానికి కేంద్రమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) మంచి విజన్ తో ఆ పథకాలను చక్కగా ఉపయోగించుకుని దేశంలోనే ఆదర్శంగా ఉండాలని, ముందు వరసలో నిలబడాలనే ఆశయంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి మన రాష్ట్రం, మన ప్రాంతం నుండి మంచి భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు.

నీటి భద్రత - జాతీయ భద్రతగా ప్రధాని పరిగణిస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు. అందుకుగాను వాటర్ షెడ్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. నీటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల వివిధ రంగాల్లో ఆరు రెట్ల ఉత్పాదకత సాధించవచ్చని అన్నారు. రెండు, మూడు పంటలు వేసుకునే అవకాశం ఉందన్నారు. భూగర్భ జలాలు కనీసం మూడు మీటర్ల పెరుగుదల ఉంటుందని అన్నారు. 2021 నుంచి 26 సంవత్సరం వరకు వాటర్ షెడ్ 2.0ను రూ.13 వేల కోట్లతో అమలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు మేథో మదనం (Brain Storming) జరగాల్సిన అవసరం ఉందని వివరించారు. శాఖల మధ్య సమన్వయం, సహకారం అవసరమని, అలా కాకపోతే అమలులో జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. వర్షపు నీటిని ఒడిసి పడదాం.. జీవనాధారం పెంచుదాం అని డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు.

Next Story