నేడు పుట్టపర్తిలో రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి పర్యటన

by Thanuru Gopichand |   (  Updated:2025-11-22 03:14:37  IST  )

పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Of India), ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.

నేడు పుట్టపర్తిలో రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Of India), ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. వారికి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఆహ్వానం పలకనున్నారు. ఈ మేరకు పుట్టపర్తి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి ఉదయం 10.50 గంటలకు సత్యసాయి విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక వాహనాల్లో హిల్ వ్యూ స్టేడియం చేరుకోనున్నారు. ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం 3.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సత్యసాయి విమానాశ్రయం, ప్రముఖుల కాన్వాయ్ లు వెళ్లే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, దారి మళ్లింపుల వద్ద పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తరువాతే ఉత్సవాలకు అనుమతిస్తున్నారు.

Next Story