విశాఖపట్నం పర్యటనకు రాష్ట్రపతి ముర్ము... ఎప్పుడంటే?

by velandi.Saikiran |

భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( Droupadi Murmu) విశాఖపట్నం పర్యటనకు రాబోతున్నారు. జూన్ 10వ తేదీన విశాఖలో

విశాఖపట్నం పర్యటనకు రాష్ట్రపతి ముర్ము... ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( Droupadi Murmu) విశాఖపట్నం పర్యటనకు రాబోతున్నారు. జూన్ 10వ తేదీన విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు.

ఇందులో భాగంగానే...ఆ రోజున ఉదయం 11:30 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఆ తర్వాత కారులో బీచ్ రోడ్డులోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్తారు. అక్కడ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:20 గంటలకు ఝార్ఖండ్ పర్యటనకు వెళ్తారు ద్రౌపది ముర్ము. అయితే జూన్ 10వ తేదీన వైజాగ్ వస్తున్న ద్రౌపది ముర్ముకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయబోతోంది కూటమి సర్కారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిన తర్వాత ఆమెను ఆహ్వానించబోతున్నారు.

Next Story