- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. సర్వం సిద్ధం చేసిన అధికారులు
by Malleboina Mahesh |
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భద్రతా ఏర్పాటు కట్టుదిట్టం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భద్రతా ఏర్పాటు కట్టుదిట్టం చేశారు. రేణిగుంట ఎయిర్‌పోర్టుకు రాష్ట్రపతి ముర్ము మద్యాహ్నం 3.25 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం 3.55కు తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆమె తిరుమలకు చేరుకోనుండగా.. రాష్ట్రపతి ముర్ము కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎల్లుండి ఉదయం రాష్ట్రపతి దర్శన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటలకు శ్రీ వరాహస్వామి వారిని, 10 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాదుకు బయలుదేరనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Next Story






