- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu), ఈవో ఏవీ ధర్మారెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాష్ట్రపతికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆమె ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు.
రాష్ట్రపతి రాక సందర్భంగా ఆలయ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రేణిగుంట (Renigunta) విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 12:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport)కు చేరుకుంటారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. రేపు ద్రౌపది ముర్ము ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి పుట్టపర్తికి వెళ్లనున్నారు.






