- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
తిరుచానూరు అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని(Tiruchanur Padmavati Ammavaru) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేసి మొక్కులు కోరుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దగ్గరుండి రాష్ట్రపతి ముర్మకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్మును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌తో పాటు తదితరులు ఆహ్వానం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆమెను ఘనంగా స్వాగతించారు.
Next Story






