- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kharif season : ఖరీఫ్‌కు.. సన్నద్ధం
ఖరీఫ్ సాగుకు అవసరైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందే విధంగా చూడాలలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.

నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్య లేకుండా చూడాలి
విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందాలి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : ఖరీఫ్ సాగుకు అవసరైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందే విధంగా చూడాలలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (MInister Achennayudu) ఆదేశించారు. బహిరంగ మార్కెట్ లో ఎటు వంటి నకిలీ విత్తనాలు, ఎరువుల (seeds and pesticides) సమస్య లేకుండా అధికారలు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు ఖరీఫ్ సంసిద్దతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికా రులతో రాష్ట్ర సచివాలయం నుండి బుధవారం ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ది రేటును సాదించాలనే లక్ష్యంతో అధికారులు అంతా సమై ఖ్యంగా కృషి చేయాలన్ని ఆదేశించారు. ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని, సంప్రదాయ పంటల సాగును క్రమంగా తగ్గిస్తూ ఉద్యానమన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాన్నారు. ప్రకృతి సేద్యం అమల్లో ఉన్న ప్రాంతాల్లో శత శాతం అమల్లోకి తేవాలని, క్రమేణా మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు.
భూసార పరీక్షల నివేదికలు రైతులకు సమకాలంలో అందజేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకై అందే ధరఖాస్తులను నాలుగైదు రోజుల్లో పరిష్కరించాలని,ఈ పథకం క్రింద 50 శాతం రాయితీ సొమ్మును ముందుగానే అంద జేస్తున్నామని, రైతుల వాటా సొమ్ము బ్యాంకు ఋణాలు ద్వారా అందజేసే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బిందు తుంపర్ల సేద్యాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, వంద శాతం లక్ష్యాలను సాదించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు సకాలంలో అందజేయాలన్నారు. కౌలు రైతులు అందరికీ సి.సి.ఆర్.సి. కార్డులు అందజేయాలను, ప్రతి కౌలు రైతుకు బ్యాంకు ఋణం అందేలా చూడాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తామని, ఏ ఒక్కరూ మద్యవర్తులను ఆశ్రయించి డబ్బులను పోగొట్టుకోవద్దని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ బి.రాజశేఖర్ తదతరులు పాల్గొన్నారు.






