తిరుమల శ్రీవారికి విలువైన ఆభరణాలు బహుకరణ

by Jakkula.Mamatha |

కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు. ఈ

తిరుమల శ్రీవారికి విలువైన ఆభరణాలు బహుకరణ
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఉదయం ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు ధరించి తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామి వారి శేష వస్త్రం తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి సంజీవ్ గోయెంకా ఆభరణాలు విరాళంగా ఇచ్చారు. సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

Next Story