Praveen Death Mystery: పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ.. కేసులో తాజా అప్‌డేట్ ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-29 07:40:40  IST  )

క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల (Praveen Pagadala) అనుమానాస్పద మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ

Praveen Death Mystery: పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ.. కేసులో తాజా అప్‌డేట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల (Praveen Pagadala) అనుమానాస్పద మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనను ఎవరైనా కుట్రపూరితంగా హత్య (Murder) చేశారా.. లేక ప్రమాదానికి గురయ్యారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రవీణ్ మృతిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అటు క్రైస్తవ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ (Telangana) ప్రాంతానికి చెందని ప్రజాప్రతినిధులు సైతం ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

కేసులో నిజానిజాలు వెలికితీసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)ను ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి రాజమండ్రి (Rajahmundry) శివారులో ప్రవీణ్ ప్రమాదానికి గురైన స్పాట్ వరకు మొత్తం 15 గంటల సీసీ కెమెరా ఫుటేజీ (CCTV footage)ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ టీమ్ (Forensic Team) ఎవిడెన్స్‌లను కలెక్ట్ చేసింది. అదేవిధంగా హైదరాబాద్‌ (Hyderabad)లో ఉన్న ప్రవీణ్ కుటుంబ సభ్యులను విచారించి వారి నుంచి స్టేట్‌మెంట్‌ను ఏపీ పోలీసులు (AP Police) రికార్డ్ చేశారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ప్రవీణ్ పోస్ట్‌మార్టం రిపోర్టు (Postmortem Report) వచ్చే అవకాశం ఉన్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కేసులో ఆ రిపోర్టే కీలక కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story