AP News : ఏపీ ఫైబర్‌నెట్‌ కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య.. ఉత్తర్వులు జారీ

by Malleboina Mahesh |   (  Updated:2025-02-25 13:22:35  IST  )

ఏపీ ఫైబర్‌నెట్‌ కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ తో పాటు.. ఆంధ్రప్రదేశ్ గ్యాస్‌, డ్రోన్‌ కార్పొరేషన్ల ఎండీగా..ప్రవీణ్‌ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

AP News : ఏపీ ఫైబర్‌నెట్‌ కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఎవరు ఊహించని విధంగా సోమవారం మధ్యాహ్నం ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్(Chairman of AP Fiber Net) పదవికి, టీడీపీ(TDP) ప్రాథమిక సభ్యత్వానికి జీవి రెడ్డి(GV Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించాగా.. ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం.. ఏపీ ఫైబర్‌నెట్‌ కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య (Praveen Aditya is the new MD of AP Fibernet)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (Government orders) జారీ చేసింది. ఫైబర్ నెట్ తో పాటు.. ఆంధ్రప్రదేశ్ గ్యాస్‌, డ్రోన్‌ కార్పొరేషన్ల ఎండీగా..ప్రవీణ్‌ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయన ఈ క్షణం నుంచి ఫైబర్ నెట్ ఎండీ (Fiber Net MD)తో భాద్యతలతో పాటు, గ్యాస్‌, డ్రోన్‌ కార్పొరేషన్లకు సైతం ఎండీగా అదనపు భాద్యతలు (Additional responsibilities as MD for gas and drone corporations) స్వీకరిస్తారని, తదుపరి ఉత్తర్వుల వరకు గ్యాస్‌, డ్రోన్‌ కార్పొరేషన్ల ఎండీగా అదనపు బాధ్యతలు కొనసాగిస్తారని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే.. నిన్న జీవి రెడ్డి తన లేఖలో ఇలా రాసుకొచ్చారు. ‘‘వ్యక్తిగత కారణాలతో, నేను తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హొదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు దేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను అని రాసుకొచ్చారు.

Next Story