అలాంటి వారు ప్రజలకు అవసరమా ? : ప్రత్తిపాటి

by Naga Rani Yarlagadda |

గతంలో రైతులను వేధించినందుకే జగన్ (YS Jagan)కు ప్రతిపక్ష హోదా దక్కలేదని విమర్శించారు. ఐదేళ్లపాటు రైతన్నను పట్టించుకోనివారు కూడా నేడు రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

అలాంటి వారు ప్రజలకు అవసరమా ? : ప్రత్తిపాటి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా దర్శి మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నదాత సుఖీభవ పథకాన్ని (Annadatha Sukhibhava) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పల్నాడు జిల్లా యడ్లపాడులో నిర్వహించిన ఎడ్ల ఊరేగింపులో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pullarao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రైతులను వేధించినందుకే జగన్ (YS Jagan)కు ప్రతిపక్ష హోదా దక్కలేదని విమర్శించారు. ఐదేళ్లపాటు రైతన్నను పట్టించుకోనివారు కూడా నేడు రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా తప్పుడు మెయిల్స్ పెట్టి అడ్డుకునేవారు ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. జగన్ వంటి వ్యక్తితో రాష్ట్రానికి, ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదమేనన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో సమస్యలను పరిష్కరించామని, ఏడాది కాలంలో భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలను కూడా పరిష్కరిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

Next Story