- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం
by Naga Rani Yarlagadda |
ఇటీవల కాలంలో రైళ్లలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో రైళ్లలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో మరో దొంగల ముఠా చోరీకి పాల్పడింది. అనకాపల్లి వద్ద రైలు ఆగి ఉండగా.. ఈ ఘటన జరిగింది. దొంగలు.. ప్రయాణికుల్ని కత్తులు చూపించి, బెదిరించి రూ.38 వేలు నగదు, మూడు సెల్ ఫోన్లను లాక్కెళ్లారు. ఈ మేరకు బాధితులు విశాఖపట్నంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి పాల్పడిన దొంగల్ని సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. విశాఖ వైపు వెళ్లే రైళ్లలో తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. దొంగల ముఠాలకు రైల్వే పోలీసులు అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Next Story






