AP News : ప్రసన్న కుమార్ పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రశాంతి రెడ్డి

by Muthe.Rajitha |

వైసీపీ(YCP) నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(Prasanna Kumar Reddy)పై టీడీపీ(TDP) కోవూరు ఎమ్మెల్యే వేమూరి ప్రశాంతి రెడ్డి(MLA Prashanthi Reddy) ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

AP News : ప్రసన్న కుమార్ పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రశాంతి రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ(YCP) నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(Prasanna Kumar Reddy)పై టీడీపీ(TDP) కోవూరు ఎమ్మెల్యే వేమూరి ప్రశాంతి రెడ్డి(MLA Prashanthi Reddy) ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా నిన్న జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ప్రసన్నకుమార్ ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే కొన్ని గంటల అనంతరం ప్రశాంతిరెడ్డి అనుచరులు ప్రసన్నకుమార్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈక్రమంలో తనపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నేడు నెల్లూరు ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ప్రసన్నకుమార్ ను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

Next Story