ఈ ప్రశ్నలకు సమాధానం ఏది? పవన్‌కు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-13 16:48:36  IST  )

ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏది..? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికిందా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశారు.

ఈ ప్రశ్నలకు సమాధానం ఏది? పవన్‌కు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏది..? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికిందా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశారు. పవన్ గతంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రకాష్ రాజ్ షేర్ చేశారు. ఆ వీడియోలో పవన్... ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము అంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లాయని మండిపడ్డారు. ఆ మాటలు తమను చంపేస్తున్నాయని అన్నారు. మీరు ఇచ్చిన స్టేట్ మెంట్ తీవ్రమైన బాధను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని లేకుండా తమను తెలంగాణ నుండి వేరు చేశారని అన్నారు. తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు. తమ హక్కుల కోసం కొట్లాడుతామని రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. స్పెషల్ స్టేటస్ కోసం అమరావతిలో ఉద్యమం చేస్తామని దేశమంతా తమవైపు చూసేలా చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు కానీ హోదా ఇవ్వకపోవడంతోనే ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌కు కౌంటర్ వేశారు. అప్పుడ ప్రశ్నించి పవన్ ఇప్పుడెందుకు సైలెంట్ ఉంటున్నారని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసినట్టు కనిపిస్తుంది.

Next Story