- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prakasham | భైరవకోన జలపాతం వద్ద పర్యాటకుల సందడి
ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన (Bhairavakona) జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన (Bhairavakona) జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఎత్తైన కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం వీక్షకుల మదిని దోచుకుంటోంది. ప్రకాశం జిల్లావాసులతో పాటు పరిసర జిల్లాలవారు, ఇతర రాష్ట్రాలవారు జలపాతాన్ని వీక్షించేందుకు తరలివస్తున్నారు. దీంతో చుట్టూ పరిసరాలు జన సందోహంతో సందడిగా మారాయి. జలజలవారుతూ, గలగలపారుతున్న నీటి సవ్వడి ప్రకృతి రమణీయతను కళ్లకు కడుతోంది. పక్షుల కిలకిలరావాలతో జలసిరుల శబ్దాలు శ్రావ్యమైన సంగీత అనుభూతినిస్తున్నాయి. దానికి తోడు నీటి తుంపర్లు ఎగసిపడుతూ సున్నితమైన స్పర్శతో పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. చిన్న,పెద్ద అందరూ జలపాతాల వద్ద కేరింతలు కొడుతూ సందడి చేస్తున్నారు. కార్తీక మాసం (Karthika Masam) చివరి సోమవారం కావడంతో భైరవకోనకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దేవతలను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.






