ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూ ప్రకంపనలు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-05 04:06:31  IST  )

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఉన్న పొదిలిలో (Podili) స్వల్ప భూప్రకంపనలు (Earth Quake) వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూ ప్రకంపనలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఉన్న పొదిలిలో (Podili) స్వల్ప భూప్రకంపనలు (Earth Quake) వచ్చినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3.14 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా భూమి కొద్ది సెకన్ల పాటు కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా భీకరమైన శబ్దాలు రావడంతో నివాసితులు పరుగులు పెట్టారు. ఇంట్లో నుంచి వీధుల్లోకి పరిగెత్తుతూ వచ్చి నిలుచుండిపోయారు. ఏదో పెను ప్రమాదం సంభవించిందని భావించారు. కాసేపటికి భూప్రకంపనలు ఆగిపోయి శబ్దాలు కూడా తగ్గడంతో పొదిలివాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.4 గా నమోదైందని అధికారులు తెలిపారు.

అయితే గత మే 6న కూడా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో స్వల్ప భూకంపం వచ్చింది. ఉదయం 9.54 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. కొత్తూరులోని బ్యాంకు కాలనీ, రాజు ఆసుపత్రి వీధి, ఇస్లాంపేటలో భూకంపం రావడంతో చాలా మంది ఆ రోజు వీధుల్లోకి పరుగులు తీశారు. మే 6న వచ్చిన భూకంపంలో కూడా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఏడు నెలల వ్యవధిలోనే మరోసారి భూప్రకంపనలు రావడంతో పొదిలివాసులు ఆందోళన చెందుతున్నారు. వరుస భూప్రకంపనలతో బెంబేలెత్తుతున్నారు. అందుకు కారణాలు కూడా తెలియ రావడం లేదని అంటున్నారు.

Next Story