వాడరేవులో వృద్ధుడి మృతదేహం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-28 06:43:23  IST  )

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.

వాడరేవులో వృద్ధుడి మృతదేహం
X

దిశ, చీరాల: ఓ వృద్ధుడి మృతదేహం సముద్ర తీరంలో కనిపించిన సంఘటన వాడరేవులో (Vodarevu) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజాము మస్తాన్ రెడ్డి గెస్ట్ హౌజ్ (Mastan Reddy Guest House) వద్ద ఓ వృద్ధుడి మృతదేహం (Senior Citizen Decased Body) తీరంలో కనిపించింది. గమనించిన స్థానికులు చీరాల రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చీరాల రూరల్ ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ మృతుడికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు విచారణ చేపట్టారు. మృతుడు చీరాల ఎంజీసీ కాలనీకి చెందిన గ్రంధి గణపతి రావు (70)గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీరాల పట్టణంలో బట్టల షాపులో గుమస్తాగా పనిచేస్తున్న గణపతి రావు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story