నేడు కనిగిరిలో ముఖ్యమంత్రి పర్యటన.. ఎంఎస్ఎంఈ పార్కుల శంకుస్థాపన

by Thanuru Gopichand |

నేడు ప్రకాశం జిల్లా కనిగిరి (Kanigiri) నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) పర్యటించనున్నారు.

నేడు కనిగిరిలో ముఖ్యమంత్రి పర్యటన.. ఎంఎస్ఎంఈ పార్కుల శంకుస్థాపన
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు ప్రకాశం జిల్లా కనిగిరి (Kanigiri) నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు నియోజకవర్గంలోని పీసీపల్లికి చేరుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 ఎంఎస్ఎంఈ పార్కులను 10.35 నిమిషాల తరువాత అక్కడి నుంచి ప్రారంభిస్తారు. వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని పెదఈర్లపాడులో (Peda Eerlapadu) అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కును (MSME Park) ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభిస్తారు.

రెండో దశలో భాగంగా 329 ఎకరాల విస్తీర్ణంలో రూ.134 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 15 పారిశ్రామిక పార్కులను, వాటితో పాటు 587 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న 32 ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులు, 3 ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం మొత్తం 17 జిల్లాల్లో ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతాయి. 900ల ఎకరాల విస్తీర్ణంలో రూ.810 కోట్ల పెట్టబడులతో అభివృద్ధి చేసిన ఈ పార్కుల పనులు పూర్తయ్యే సరికి వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 01.15 గంటలకు అమరావతి చేరుకుంటారు. అనంతరం 3 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవానికి హాజరవుతారు.

Next Story