Chandrababu చీరాల పర్యటన రద్దు

by Vemula.Srinu Prasad |

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చీరాల పర్యటన రద్దయ్యింది. ఈనెల10న చంద్రబాబు చీరాలలో పర్యటించాల్సి ఉంది. ..

Chandrababu చీరాల పర్యటన రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చీరాల పర్యటన రద్దయ్యింది. ఈనెల10న చంద్రబాబు చీరాలలో పర్యటించాల్సి ఉంది. అయితే మాండూస్ తుఫాన్ ప్రభావంతో వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనను రద్దు చేస్తున్నట్లు టీడీపీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల నియోజకవర్గం ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య శుక్రవారం వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచక, అసమర్ధ పాలనను ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉందన్నారు. మళ్లీ తదుపరి పర్యటన తేదీలను త్వరలో వెల్లడిస్తామని నేతలు స్పష్టం చేశారు.

Next Story