పొత్తుల వేళ జనసేనకు బిగ్ షాక్.. చీరాల సమన్వయకర్త ఆమంచి రాజీనామా

by Disha Web Desk 16 |
పొత్తుల వేళ జనసేనకు బిగ్ షాక్.. చీరాల సమన్వయకర్త ఆమంచి రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: పొత్తుల వేళ జనసేనకు బిగ్ షాక్ తగిలింది. చీరాల సమన్వయకర్త ఆమంచి స్వాములు ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సీటు ఆశించారు. అయితే ఆయనకు జనసేన అధిష్టానం చీరాల బాధ్యతలు అప్పగించారు. దీనిపై అసంతృప్తి చెంది జనసేనకు రాజీనామా చేస్తూ ఆ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహన్‌కు లేఖ రాశారు. అయితే పార్టీలో కార్యకర్తగా ఉంటానని లేఖలో పేర్కొన్నారు.

కాగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే ఆమంచి స్వాములు. ఇటీవలే ఆయన జనసేనలో చేరారు. చేరిన వెంటనే సోములకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఇటీవల చీరాల సమన్వయకర్తగా కూడా బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ బాధ్యతలపై కినుకు వహించిన సోములు తాజాగా ఆ పదవికి రాజానామా చేశారు.


Next Story

Most Viewed