మళ్లీ వైసీపీలోకి అంటూ ప్రచారం.. పుల్‌స్టాప్ పెట్టిన బాలినేని ట్వీట్

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు మళ్లీ వైసీపీలోకి వెళ్తు్న్నారంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది..

మళ్లీ వైసీపీలోకి అంటూ ప్రచారం..  పుల్‌స్టాప్ పెట్టిన బాలినేని ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు(Former Minister Balineni Srinivasrao) మళ్లీ వైసీపీలోకి వెళ్తు్న్నారంటూ ప్రకాశం జిల్లా(Praksam District) ఒంగోలు నియోజకవర్గం(Ongole Constituency)లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై బాలినేని శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. పవన్ నాయకుడు మాత్రమే కాదని నమ్మకమని, ఆదరణ, ఆశ్రయమని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌తో తాను, తన కొడుకు ఉన్న ఫొటోను షేర్ చేశారు.

వైసీపీలో పని చేసిన బాలినేని

కాగా బాలినేని తొలుత వైసీపీలో పని చేసిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనలో చేరారు. కానీ నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలతో మళ్లీ వైసీపీలోకి బాలినేని వెళ్తున్నారంటూ ఊహగానాలు చెలరేగాయి. వీటన్నింటికీ ఉగాది సందర్భంగా ఆయన చెక్ పెట్టారు.

Next Story